Janasena President Pawan Kalyan on Saturday fired at media and Andhra Pradesh TDP leaders.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం, విమర్శలు చేసిన పవన్.. తాజాగా మరోసారి అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు.
జనసేన సైనికులు శాంతంగా ఉండాలని, ఎలాంటి హింసకు పాల్పడకుండా ఉండాలని పవన్ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. శ్రీనిరాజు తనపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారని, అయినా మీరు మిమ్మల్ని నియంత్రించుకోవాలని కోరారు. తాను కూడా ఆ బలమైన మీడియా ఛానళ్లతో న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు.
మన తల్లుల్ని, కూతుళ్లను, చెల్లెళ్లను అసభ్యంగా దూషించిన టీవీ9, టీవీ5, ఏబీఎన్ ఛానళ్లను బైకాట్ చేయాలని పవన్ పిలుపునిచ్చారు.నగ్నత్వం, అశ్లీలతలతో వ్యాపారం చేస్తున్న ఆ ఛానళ్లను దూరం పెట్టాలని కోరారు. నిస్సహాయులైన సోదరీమణులతో వ్యాపారం చేస్తున్న వీటిని బైకాట్ చేయాలన్నారు.

Category
🗞
News