• 7 years ago
Actress Sri Reddy praises Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu, YSRCP chief Jagan and lashes out at Jana Sena chief Pawan Kalyan.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి ఆదివారం ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని, ఎన్నికల కోసమే ఇదంతా అని, ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు.
పాలిటిక్స్ చాలా వాడివేడిగా నడుస్తున్నాయని, మై స్వీట్.. స్వీట్ పర్సన్ పవన్ అని ఎద్దేవా చేశారు. 'పవన్ గారు.. హై హౌ ఆర్యూ.. మీరు నన్ను మర్చిపోలేదనుకుంటా. నేను కూడా మీమ్మల్ని జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. నేను చాలా సీరియస్‌గా తీసుకొని కొన్ని వేలమంది అమ్మాయిల సమస్యలను పరిష్కరించే ఉద్దేశ్యంతో కొంచెం త్యాగం చేసి ప్రారంభించిన ఉద్యమాన్ని చల్లారగొట్టారు. అందుకే లైఫ్‌లో మిమ్మల్ని ఎప్పుడూ మరిచిపోలేను.' అని ప్రారంభించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఉండి ఉంటే భవిష్యత్తులో ప్రధానమంత్రి అయి ఉండేవారని, మా కళ్లకు అదృష్టం లేక ఆయనను దూరం చేసుకున్నామని శ్రీరెడ్డి అన్నారు. ఆ విషయం పక్కన పెడితే.. జనసేన సొంతగా పెట్టుకున్న పార్టీ అని చెప్పారని, మాకు సిద్ధాంతాలు మాత్రమే ఉన్నాయని, డబ్బులు మాత్రం లేవని చెప్పారని గుర్తు చేశారు. కానీ మీకు హఠాత్తుగా సిద్ధాంతాలు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నించారు.

Category

🗞
News

Recommended