Janasena president Pawan Kalyan has reportedly moved to Vijayawada in view of his increased political activity. The Jana Sena founder had till now been based in Hyderabad. According to media reports, Pawan Kalyan has for now, moved to a rented house in Vijayawada.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలోని పడమటలంకలో శుక్రవారం నూతన గృహప్రవేశం చేశారు. అద్దెకు తీసుకున్న ఇంటిలో పవన్ కళ్యాణ్ సతీసమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్-రేణు దేశాయ్‌ల కుమారుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. గుంటూరు జిల్లా నంబూరులో లింగమనేని టౌన్‌షిప్ వద్ద నిర్మించిన దశావతార వెంకటేశ్వరస్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంప్రదాయ వస్త్రధారణతో వెళ్లారు పవన్. ఈ కార్యక్రామానికి ముందే అద్దెకు తీసుకున్న ఇంట్లో పూజలు నిర్వహించారు.
గురువారమే హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్.. శుక్రవారం ఉదయం నిరాడంబరంగా గృహ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు విజయవాడకు వచ్చినా.. హోటళ్లలోనే ఉంటున్నారు. ఇక నుంచి ఈ ఇంట్లోనే బస చేయనున్నారు. గుంటూరు జిల్లా ఖాజా టోల్ గేట్ సమీపంలో తన సొంత ఇల్లు పూర్తయ్యే వరకు పవన్ ఈ ఇంట్లోనే ఉండనున్నారు.
కాగా, రామవరప్పాడు వద్ద ప్రారంభించిన జనసేన పార్టీ కార్యాలయాన్ని జిల్లా కార్యాలయంగా ఉంచాలని, కొత్తగా రాజధాని ప్రాంతంలో భూమిపూజ చేసిన రాష్ట్ర పార్టీ కార్యాలయం పనులు త్వరగా ప్రారంభింపజేయాలని పవన్ అనుకుంటున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికి అందుబాటులో ఉండేందుకే అద్దె ఇల్లు తీసుకున్నారని, పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, ముఖ్య నేతలతో సమావేశాల నిర్వహణ పవన్ ఇక్కడ్నుంచే చేస్తారని చెప్పారు.

Category
🗞
News