• 7 years ago
JanaSena Jenda Song Composed by Anup Rubens Written by Anantha Sriram. JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014.
#JanaSena
#AnupRubens
#PawanKalyan

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెం.1 హీరోగా కొనసాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... కోట్లు సంపాదించి పెట్టే సినిమా ఇండస్ట్రీని, విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లో ఎంటరైన సంగతి తెలిసిందే. 2014లోనే ఆయన ఈ పార్టీ స్థాపించినప్పటికీ మధ్యలో కొన్ని సినిమాలు చేశారు. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలను వదిలిపెట్టేశారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజల్లో పార్టీ పట్ల ఆకర్షణ, ఉత్తేజం కగించేలా పాటలు రాయించారు.
తాజాగా 'జనసేన జెండా' పాటను విడుదల చేశారు. 'జెండారా... జెండారా..జెండారా.. జెండా....గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా, తెల్ల తెల్లని జెండా... ఇది తెలుగోడి జెండా అంటూ' సాగే ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది
దీన్ని ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కంపోజ్ చేశారు. యువ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. తిరుమల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ యాత్రలో జనసేన జెండా పాట మార్మోగనుంది.

Recommended