• 7 years ago
YSR Congress party chief YS Jaganmohan Reddy visited Tirumala on Saturday before taking Praja Sankalpa Padayatra.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైయస్‌తో పాటు పెద్ద ఎత్తున నాయకులు శ్రీవారి దర్శానానికి వచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే, వైసిపి నాయకులను తనిఖీ చేయకుండానే ఎస్పీఎఫ్ సిబ్బంది లోనికి పంపించినట్లుగా తెలుస్తోంది. అంతమంది ఒకేసారి గ్రూపుగా రావడంతో తనిఖీలు చేయలేకపోయారని తెలుస్తోంది. వందలాది మంది ఒకేసారి వస్తే ఎలా తనిఖీలు చేస్తామని ఎస్పీఎఫ్ సిబ్బంది అడిగారని తెలుస్తోంది.
జగన్ వెంట వచ్చిన వారిలో కొందరు క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులతో వచ్చారని వార్తలు వస్తున్నాయి. ఓ మహిళా నేత అక్కడి దాకా చెప్పులతో రాగా భద్రతా సిబ్బంది వారించారని, దీంతో ఆమె అక్కడే చెప్పులు వదిలేశారని అంటున్నారు.
వైయస్ జగన్ గతంలో తిరుమలకు వచ్చినప్పుడు కూడా వివాదం రాజుకుంది. అన్యమతస్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే డిక్లరేషన్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. కానీ అప్పుడు జగన్‌తో సంతకం చేయించుకోలేదనే వివాదం తెరపైకి వచ్చింది.

Category

🗞
News

Recommended