• 6 years ago
Telugu Desam Party MLA Bandaru Satyanarayana Murthy make hot comments on YSR Congress Party chief YS Jaganmohan Reddy.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో జగన్‌కు భయం పట్టుకుందన్నారు.
ఆయన బుధవారం మీడయాతో మాట్లాడారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న సమయంలో జగన్ పిల్లవాడని వ్యాఖ్యానించారు. బెంగళూరులోనో లేక మరెక్కడో హీరోయిన్స్‌తో విలాసాల్లో ఉండేవాడని విమర్శించారని తెలుస్తోంది.
జగన్ ఎవరితోనో విలాసాల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారని బండారు అన్నారు. ప్రజలు తనను మరిచిపోతారనే భయంతో తన పార్టీ ఎంపీలతో ఆయన రాజీనామా డ్రామాకు తెరలేపారన్నారు.
మార్చి 5వ తేదీలోపు ఏపీకి భారతీయ జనతా పార్టీ న్యాయం చేస్తుందని తాము భావిస్తున్నామని బండారు అన్నారు. టీడీపీ మద్దతు ఉన్నన్నిసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని ఆయన చెప్పారు. 2019లో అప్పటి పరిస్థితులను బట్టి పొత్తుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Category

🗞
News

Recommended