Telangana PCC president Uttam Kumar Reddy has accused Nakirekal TRS MLA Veeresham for Boddupalli srinivas case.
నల్లగొండ చైర్‌పర్సన్ భర్త, కాంగ్రెసు నేత బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎమ్యెల్యే వీరేశంను కాంగ్రెసు నాయకులు నిందిస్తున్నారు. బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను శుక్రవారం కాంగ్రెసు నేతలు పరామర్శించారు.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత కె. జానారెడ్డి, ఇతర నాయకులు షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బూడిద బిక్షమయ్య శ్రీనివాస్ భార్య, మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మిని ఓదార్చారు.శ్రీనివాస్ దారుణ హత్యకు ఖండిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అది ప్రభుత్వ హత్య అని ఆయన ఆరోపించారు. శ్రీనివాస్ హత్యకు సూత్రధారి నకిరేకల్ శాసనసభ్యుడు వీరేశం అని ఆయన ఆరోపించారు.
ప్రాణభయం ఉందని శ్రీనివాస్ దంపతులు గతంలోనే ముఖ్యమంత్రి కెసిఆర్కు విన్నవించుకున్నారని ఆయన చెప్పారు. హత్య జరిగి 48 గంటలు గడిచినప్పటికీ పోలీసులు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. నేర చరిత్ర ఉన్న తెరాస నాయకులను కేసీఆర్ వెనకేసుకొస్తున్నారని ఆయన విమర్శించరు.
బలంగా ఉన్న కాంగ్రెసు పార్టీని దెబ్బ కొట్టేందుకే రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని జానా రెడ్డి ఆరోపించారు. పోలీసులు శ్రీనివాస్ కాల్ డేటాను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోందని ఆయన మండిపడ్డారు.

Category
🗞
News