• 7 years ago
MLAs arekepudi Gadhi, Madhavaram Krishna Rao and Vivek travelled in RTC Bus to Telangana assembly.

ముగ్గురు తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు హైదరాబాదులో ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ ప్రయాణికుల్లా వారు బస్సులో ప్రయాణం చేసి అసెంబ్లీకి వచ్చారు. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, మాధవరం కృష్ణారావు తోటి ప్రయాణికులతో కలిసి ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఉదయం బాచుపల్లి గ్రామంలో గాంధీ ఆర్టీసి బస్సు ఎక్కారు. దానిక ముంు బస్ స్టాప్ వద్ద ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు.
గాంధీ తర్వాత వివేకానందనగర్ బస్ స్టాప్ వద్ద ఎమ్మెల్యే వివేక్ బస్సు ఎక్కారు. బస్సులో ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్సులో ప్రయాణించారు. ఆయన అసెంబ్లీ ముందు ఆకాశవాణి కేంద్రం బస్ స్టాప్ వద్ద బస్సు దిగి కాలినడకన అసెంబ్లీకు చేరుకున్నారు. తోటి ప్రయాణికులతో పాటు ఎమ్మెల్యేలు బస్టాండ్‌లో బస్సు కోసం నిరీక్షించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తన నివాసం నుంచి కాలినడకన సాధారణ ప్రయాణికుడి మాదిరిగా బస్టాప్‌నకు చేరుకున్నారు. సుభాష్ నగర్ నుంచి సిపిఎస్ ఆర్టినరీ బస్సు ఎక్కి అసెంబ్లీ వరరకు తనతో పాటు పిఎ, ఇద్దరు గన్‌మెన్‌కు టికెట్లు తీసుకున్నారు.
బస్సులో ఓ కాలేజీ విద్యార్థి లేచి వివేక్‌కు సీటు ఇచ్చారు. స్కూల్ కాలేజీ రోజుల్లో బస్సులో వెళ్లిన రోజులను వివేక్ గుర్తు చేసుకున్నారు. బస్సు కండక్టర్‌ను కూడా ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచో అసెంబ్లీకి బస్సులో వచ్చి సమస్యలను తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఇప్పటికి సాధ్యమైందని అన్నారు.

Category

🗞
News

Recommended