• 8 years ago
"Kutumba Katha Chitram" is a Family Entertainer. This is not a tagline but the title of the new movie starring Sri Mukhi. Directed by actor Harshavardhan. The movie is said to be made on a controlled budget with the actor handling many roles and he will soon complete the post production and release the movie it seems.

భాస్కర గ్రూప్ అఫ్ మీడియా సంస్థలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన చిత్రం ''కుటుంబ కథా చిత్రం''. ఈ చిత్రానికి వి.ఎస్.వాసు దర్శకుడు.
గురువారం ఉదయం హైదరాబాద్ లో ఈ సినిమా పోస్టర్ మరియు టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అందరూ హాజరయ్యారు.
ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమా నిర్మాత భాస్కర్ యాదవ్ నన్ను చాలా విసిగించాడు. నేను కొన్ని సార్లు ఇటువంటి సినిమాలు చిన్న సినిమాలు నడవవు అని కూడా అన్నాను. కానీ తను మొండిగా కష్టపడ్డాడు. సినిమా చేసి చూపించాడు. నిజానికి ఈ సినిమాకి నిర్మతనే హీరో అంటూ చాలా ఆవేశంతో చిన్న సినిమాలు విడుదల చేసుకోటానికి సరిగా థియేటర్స్ కుడా లేవు.. ఇటువంటి పరిస్థితుల్లో కుడా సినిమాలు తీస్తున్నారు అంటే సినిమా మీద ఎంత అభిమానం వుందో తెలుసుకోవాలి. నా వంతుగా నేను సాహసం చేస్తాను సినిమా విడుదల కోసం నేను ముందు నిలబడుతా అంటూ వేదిక సాక్షిగా నిర్మాతకి మాటిచ్చారు.
హీరో నందు మాట్లాడుతూ నేను ఇప్పుడే మాట్లాడను ఇంకా ట్రైలర్ విడుదలయ్యాక మాట్లాడుతా ఎందుకంటే అది చూసాక అందరికి ఒక అవగాహన వస్తుంది. ఇది ఎటువంటి సినిమానో, ఇంగీష్ సినిమాలల్లో,కొరియన్ సినిమాల్లో వున్నట్టు వుంటుంది. ఈ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా వుంటుంది ఇందులో పని చేసిన వాళ్ళకి తప్పకుండా పేరు వస్తుంది అని అన్నారు.

Recommended