• 8 years ago
Actor Dhan Raj also told that people who are criticising the movie will change their opinion once they watch the film. The film is releasing on 17th on this month along with the 7 other films.

నెక్రోఫీలియా కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా అంటూ దేవీ శ్రీ ప్రసాద్ ఆ మధ్య బాగానే హల్చల్ చేసింది. స్వామిరారా సినిమా ఫేమ్ పూజా రామచంద్రన్.. ఈ సినిమాలో ఓ కీలక రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ పాత్రలో నటిస్తోంది. అయితే యాక్సిడెంట్‌లో ఆమె మరణిస్తుంది. శవాన్ని మార్చురీలో పెడితే.. శవంపై అత్యాచారానికి తెగబడతారు. ఆ కాన్సెప్ట్‌తోనే సినిమా తీస్తున్నాడు డైరెక్టర్ శ్రీ కిషోర్.
ఆర్వో క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్వీ రాజు నిర్మిస్తున్నాడు. మరి ఇంతకీ శవంపై అత్యాచారం చేసిందెవరు? అంటే ‘దేవిశ్రీప్రసాద్' అట. అంటే ‘దేవి, శ్రీ, ప్రసాద్' అనే ముగ్గురు స్నేహితులట. టైటిల్ రోల్స్‌లో మనోజ్ నందం, ధన్‌రాజ్ మరో కొత్త కుర్రాడు నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ప్రముఖ పాత్రలో నటించిన ధన్‌రాజ్ చిత్ర విశేషాలను తెలియజేశారు. "ఈ సినిమాలో హీరోయిన్ పూజా రామచంద్రన్ మెయిన్ రోల్ చేసింది. నేను, భూపాల్, మనోజ్ నందం.. ముగ్గురం ప్రధాన పాత్రల్లో నటించాం. దేవి అనే పాత్రలో భూపాల్, ప్రసాద్ పాత్రలో మనోజ్ నందం నటిస్తే, నేను శ్రీ అనే పాత్రలో కనపడతాను.
సినిమా అంతా ఆరు క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంది. నా పాత్ర విష‌యానికి వ‌స్తే.. నాది మార్చురీ వ్యాన్ డ్రైవ‌ర్‌ పాత్ర.

Recommended