• 8 years ago
Akhil Akkineni is getting ready with Hello movie. This movie is set to release on December 22nd. In this occassion, Akhil joined a Television game show recently. As part of the show, He said.. going on date with Trisha is impossible, because of Rana Daggubati.

అక్కినేని నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన మరో హీరో అఖిల్. అక్కినేని కుటుంబ కథా చిత్రం మనంలో అతిథిగా కనిపించినా.. అఖిల్ సినిమా ఆయనకు తొలి చిత్రం. కానీ బాక్సాఫీస్ వద్ద అంతగా స్పందన కనిపించలేదు. ఈ నేపథ్యంలో సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌లో తాజాగా హలో చిత్రం నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా ఓ షోలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు.
సిసింద్రీ సినిమా చేసేటప్పుడు నా వయసు ఒక సంవత్సరం. అప్పుడు నాకు ఏమీ తెలియదు.అమ్మ, నాన్న, డైరెక్టర్ నా చేత నటింప జేయడానికి చాలా కష్టపడ్డారు అని చెప్పాడు.
అలాగే తనకు తెలుగు సరిగా వచ్చేది కాదని, ఇప్పుడు నేను తెలుగు బాగా మాట్లాడానికి, సినిమాలో నా తెలుగు మంచి ఉండటానికి మా స్కూల్ టీచరే కారణం అంటూ చెప్పాడు.
సినిమాల గురించి మాట్లాడుతూ..యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించాలని ఉంది. అలాగే ఐదేళ్ల తర్వాత మహేశ్‌బాబుతో మల్టీస్టారర్ చేస్తాను. అల్లు అర్జున్‌ నిర్మాతగా మారే అవకాశం ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాధారణంగా ఉండే స్థితిని, సిల్వర్ స్క్రీన్‌‌పై ఆయన క్రేజ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది.

Recommended