• 8 years ago
Supreme Hero Sai Dharam Tej’s success graph plunged after Tikka, Winner, Nakshtram films tanked heavily at the box office. Now, he is getting ready with his latest film Jawaan, which is releasing December 1st, 2017).

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ పిల్లా నీవు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం లాంటి వరుస విజయాలు అందుకొన్నాడు. ఆ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం చిత్రాలు ఫ్యాన్స్ నిరాశపరిచాయి. ప్రస్తుతం సినీ రచయిత బీవీఎస్ దర్శకత్వంలో జవాన్ చిత్రంతో డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దేశభక్తి ప్రధానంగా రూపొందిన చిత్రంగా రిలీజ్‌కు ముందే క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సాయిధరమ్ తేజ్‌ మరో సక్సెస్ చేజిక్కించుకొన్నారా? అనేది తెలుసుకోవాలంటే ఒక సారి కథలోకి వెళ్లాల్సిందే.
జై (సాయి ధరమ్ తేజ్), జైకి చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. దేశానికి రక్షణగా నిలిచే సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)లో సైంటిస్ట్ కావాలనేది కోరిక. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడి ఇంటర్వ్యూకు వెళుతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఉద్యోగాన్ని సంపాదించలేకపోతాడు. ఈ క్రమంలో కేశవ్ గ్యాంగ్ ( ప్రసన్న, సుబ్బరాజు) విదేశీ శక్తులతో కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర పన్నుతుంది. అందుకోసం డీఆర్‌డీవో రూపొందించిన అతిశక్తివంతమైన ఆక్టోపస్ మిసైల్ లాంఛర్‌ను దొంగిలించాలను కొంటారు. ఈ విషయం తెలిసిన జై.. ఆక్టోపస్ తీవ్రవాదులకు అడ్డుగా నిలుస్తాడు. దాంతో జై కుటుంబాన్ని ముట్టుపెట్టడానికి కేశవ్ ముఠా ప్రయత్నిస్తుంటుంది.

Recommended