• 8 years ago
Fatima Sana Shaikh is no stranger to online trolls. The Dangal actor posted a stunning picture of herself in a red saree, and it did not take long for a barrage of negative comments to be directed at her.

దంగల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న ఫాతిమా సనా షేక్‌కు సోషల్ మీడియాలో చేదు అనుభవం ఎదురైంది. చీరకట్టులో అందంగా ముస్తాబై తన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా దానిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. పోర్న్ స్టార్, సిగ్గులేదా లాంటి వ్యాఖ్యలతో నానా మాటలు అనడం మీడియాలో చర్చనీయాంశమైంది. గతంలో రంజాన్ నెల సందర్భంగా స్విమ్ సూట్ ధరించిన ఫాతీమాపై నెటిజన్లు మండిపడిన సంగతి తెలిసిందే.
హిందీలో కమల్ హాసన్ రూపొందించిన చాచీ 420 చిత్రంతో బాలతారగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పేరు రాకపోయినా దంగల్ చిత్రంతో మంచి క్రేజ్ సంపాదించింది. సహజంగా అందంగా కనిపించే ఫాతీమాను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆరాధిస్తుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని కూడా ప్రపోజల్స్ పెడుతుంటారు.
తాజాగా ఎరుపు రంగు చీరలో అదిరిపోయే ఫోజు ఇచ్చిన ఫొటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో కింద చాలా దారుణంగా కామెంట్లు పెడుతున్నారు
నెటిజన్లలో ఓ వ్యక్తి సిగ్గులేదా అని కామెంట్ పెట్టగా, మరో వ్యక్తి నీ ఫొటో చూస్తే నీకు ఆఫర్లు లేనట్టు కనిపిస్తున్నది. అందుకే బట్టలు విప్పి రెచ్చగొడుతున్నది అని కామెంట్ పెట్టాడు.
ఇంకో నెటిజన్ మరో అడుగు ముందేసి దారుణమైన కామెంట్ చేశాడు. నీవు ఒక పని చేయి.. పోర్న్‌స్టార్ అయిపోతే బాగుంటుంది అని కామెంట్ చేసాడు.
ఇలా ఫాతీమా సనా షేక్‌పై నెటిజన్లు చేసిన కామెంట్లు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

Recommended