Skip to playerSkip to main contentSkip to footer
  • 6/15/2018
Actress Apoorva photo in online became hot topic. Other heroines, anchors pics also there in website

టాలీవుడ్ లో మరో కలకలం చోటు చేసుకుంది. అనేక వివాదాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఇప్పటికే సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ గురించి ఇటీవల వరకు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ హీరోయిన్లు, యాంకర్స్ ఫోటోలు ఉపయోగించి డేటింగ్ బిజినెస్ సాగిస్తున్న దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందులో ప్రముఖ నటి అపూర్వ కూడా బాధితురాలు కావడంతో ఆమె పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఈ వెబ్ సైట్ గురించి అపూర్వ సంచలన వాస్తవాలు వెల్లడించారు.
ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ లో తన ఫోటో ఉందని చెప్పగానే షాక్ అయ్యానని అపూర్వ చెబుతోంది. ఈ విషయాన్ని మొదటగా తన కజిన్ తెలియజేసినట్లు అపూర్వ తెలిపింది. దీనితో తాను వేంటనే పోలీస్ లని ఆశ్రయించి 20 రోజుల క్రితమే ఫిర్యాదు చేసినట్లు అపూర్వ చెప్పుకొచ్చింది.
ఆ వెబ్ సైట్ లో చాలా మంది టాలీవుడ్ హీరోయిన్స్, యాంకర్స్ ఫోటోలు కనిపించాయని అపూర్వ తెలిపింది. తమ ఫోటోలు అసభ్యంగా ఉపయోగించి వారు వ్యాపారం సాగిస్తున్నారని అపూర్వ ఆరోపించారు.
అపూర్వ ఫిర్యాదు చేయక ముందు నుంచే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఆన్ లైన్ వెబ్ సైట్ పై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విచారణ కోసం నటి అపూర్వ కూడా వెళ్లారు. ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని, గతంలో ఎప్పుడూ చూడలేదని అపూర్వ తెలిపింది.

Recommended