• 7 years ago
మావూరి' వంట అనే చిన్న టీవీ కార్యక్రమంతో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్యామల తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ యాంకర్‌గా ఎదిగింది. తర్వాత టీవీ సీరియళ్లు, సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 2లో టాప్ కంటెస్టెంటుగా తన హవా కొనసాగిస్తోంది. శ్యామలకు చాలా కాలం క్రితమే పెళ్లయింది. నరసింహ రెడ్డి అనే టీవీ నటుడిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే శ్యామల పెళ్లి వెనక చాలా పెద్ద స్టోరీ ఉంది. పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నరసింహారెడ్డి శ్యామల జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
శ్యామల ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను ఉంటున్న రూమ్ దగ్గర కొబ్బరి బొండం తాగడానికి వచ్చేది. ఆ సమయంలో ఆమెను చూశాను. తర్వాత అనుకోకుండా మాకు ఒకే సీరియల్ లో జంటగా నటించే అవకాశం వచ్చింది. అలా మొదలైన పరిచయం ఇద్దరి మధ్య ప్రేమగా మారిందని నరసింహారెడ్డి తెలిపారు.
రోజూ ఇద్దరం కలిసి డబ్బింగ్ చెప్పడానికి వెళ్లేవారం. ఓ రోజు నాకు ఐస్ క్రీమ్ కొని పెట్టమని అడిగింది. తర్వాత తనే ప్రపోజ్ చేసింది. నీతో ఉండటం ఇష్టమని చెప్పింది. నాకు కూడా ఆమంటే ఇష్టం ఉండటంతో ఒకే చెప్పాను. మా ఇంట్లో వారికి శ్యామలను పరిచయం చేశాను అని నరసింహారెడ్డి తెలిపారు.

Bigg Boss Shyamala Husband Narasimha Reddy Sensational Comments about Tollywood
#BiggBoss

Recommended