• 7 years ago
బిగ్ బాస్ తెలుగు సెకండ్ సీజన్లో ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతారనుకుంటున్న టాప్ కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అయి బటకు వస్తున్నారు. తాజాగా యాంకర్ శ్యామల ఇంటి నుండి బయటకు రావడమే ఇందుకు నిదర్శనం. ఆమె ఎలిమినేట్ అవుతుందని ప్రేక్షకులే కాదు, ఆమె కూడా అసలు ఊహించలేదు. దీంతో చాలా మందిలో బిగ్ బాస్ షో జరుగుతున్న తీరుపై అనుమానాలు రేకెత్తడం మొదలైంది. తాజాగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయిన శ్యామల బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతోంది? అనే వాస్తవాలు బయట పెట్టే ప్రయత్నం చేశారు.
బిగ్ బాస్ షో స్క్రిప్టు ప్రకారం జరుగుతోందా? లేక రియాల్టీగా జరుగుతోందా? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దీనిపై శ్యామల స్పందించారు. స్క్రిప్టు ప్రకారం జరుగుతుందనే ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఇంట్లో ఎవరికి నచ్చినట్లు వారు గేమ్ ఆడతారు? వారి బిహేవియర్ బట్టే ఎలిమినేషన్‌కు నామినేట్ అవ్వడం, ప్రేక్షకుల ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ జరుగుతుందని తెలిపారు.
ఇంత తొందరగా ఇంటి నుండి బయటకు రావడం బాధగా ఉందని శ్యామల తెలిపారు. ఇంకా కొంతకాలం బిగ్ బాస్ ఇంట్లో ఉండాలనిపించింది. నా గురించి పూర్తిగా ప్రేక్షకులు చూడలేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి రైట్ టాస్క్ రాలేదు. ఇంకొన్నాళ్లు ఉంటే రైట్ టాస్క్ వచ్చి ఉండేదేమో? తొందరగా వచ్చాననే ఫీలింగ్ అయితే ఉంది... అని శ్యామల తెలిపారు.

Aafter eliminated from Bigg Boss 2 house anchor Shyamala said, she was very balancing throughout her journey in the house and added that she has believed that she would have stay in the house for long time.

Recommended