• 7 years ago
Sanjana Eliminated from Bigg Boss 2 and Drops Bigg Bomb on Babu Gogineni. Bigg Boss gave special power of ‘Bigg Bomb’ to Sanjana. She dropped the ‘Bigg Bomb’ on Babu Gogineni. As per the power, Babu Gogineni must supply drinking water to other contestants in the house.
#BiggBoss2

బిగ్ బాస్ సీజన్ 2 రసవర్తరంగా మారింది .మంగళవారం నాటి ఎపిసోడ్‌లో హౌజ్‌మేట్స్‌కు టాస్క్‌ను ఇచ్చారు. ‘ఎవడ్రా రాజ్యాన్ని గెలిచేది’ అనేది టాస్క్. నూతన్ నాయుడు రాజు.. దీప్తి రాణి.. నందిని యువరాణి.. గీతా మాధురి సంచాలకురాలు. మిగిలిన హౌజ్‌మేట్స్ గ్రామస్థులు. రాజు, రాణి, యువరాణి ప్రత్యేక దుస్తులు ధరించగా.. గ్రామస్థులంతా కాషాయి వస్త్రాలు వేసుకున్నారు. గ్రామస్థులు ఇద్దరిద్దరు చొప్పున టాస్కుల్లో పాల్గొన్నారు. గెలిచిన వారు రాజుగారి టీంలో చేరారు. టాస్క్‌లో ఎవరు గెలిచారో నిర్ణయించే అధికారం సంచాలకురాలు గీతా మాధురికి ఇచ్చారు. ఒక్కో జంటకు ఒక్కో రకమైన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లన్నీ బురదలోనే ఉండటం ఆసక్తికరం. అంతా సవ్యంగా జరిగినా.. కౌశల్ మాత్రం కాస్త రచ్చ చేశాడు.
కౌశల్, అమిత్‌ ఒక టాస్క్‌లో పోటీ పడ్డారు.బురదను ఒంటికి, బట్టలకు అంటించుకుని.. ఆ బురదను చేతులతో లాగుతూ బకెట్‌లో వేయాలి.వేయకూడదు. ఈ టాస్క్‌ను అమిత్ సక్రమంగానే చేసినప్పటికీ, కౌశల్ రూల్స్ అతిక్రమించాడు. చేతులతో డైరెక్ట్ గా బురదను తీసి వేస్తూ బకెట్‌ను నింపేశాడు. టాస్క్ పూర్తయిన సమయానికి అమిత్ కన్నా కౌశల్ బకెట్‌లోనే ఎక్కువ బురద ఉంది. అయితే నిబంధనలను అతిక్రమించిన కారణంగా అమిత్‌ను విజేతగా ప్రకటించారు. దీనిపై కౌశల్ వాదానికి దిగాడు. చేతులకంటిని బురదను తాను బకెట్‌లో వేశానని వాదించాడు. అయితే సంచాలకురాలు నిర్ణయమే తుది నిర్ణయమని చెప్పడంతో అసహనంతోనే అంగీకరించాడు.

Recommended