• 7 years ago
Celebrities Twitter Reactions on Mahesh Babu's Bharath Ane Nenu first Oath. Bharat Ane Nenu is an upcoming Indian political thriller film directed by Koratala Siva, featuring Mahesh Babu and Kiara Advani in the lead roles.

'శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు- హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాలో మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఆడియోను 'ఫస్ట్ ఓథ్' పేరుతో విడుదల చేశారు. దీనికి అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. పలువురు సినీ స్టార్లు కూడా దీనిపై స్పందించారు.
ఇది విన్న వెంటనే నా రోమాలు నిక్కబొడిచాయి. ఫస్ట్ ఓథ్ అద్భుతంగా ఉంది అంటూ అక్కినేని యంగ్ స్టార్ అఖిల్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.
ఈ ఏడాది జరిగే ఎలక్షన్లో అన్ని ఓట్లు, సీట్లు మావే... నో డౌట్ అంటూ నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
మహేష్‌ బాబు వాయిసే అంతా చెప్పేస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమేన‌ని వంశీ పైడిపల్లి వ్యాఖ్యానించారు.
మహేష్‌ గొంతు వింటుంటే సూపర్‌స్టార్‌ కృష్ణ గుర్తుకొచ్చారని రామజోగయ్య శాస్త్రి పేర్కొన్నారు. వీనులవిందు తర్వాత కన్నుల పండుగలా ఫస్ట్ లుక్ ఉందని ట్వీట్ చేశారు.
మహేష్ బాబుతో ఒక్కడు లాంటి సూపర్ హిట్ చిత్రం తీసిన గుణ శేఖర్ మహేష్ బాబు అండ్ ‘భరత్ అనే నేను' టీంకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.
'అబ్బా..ఏమున్నాడు రా బాబూ' అని సుధీర్ బాబు వ్యాఖ్యానించాడు.

Recommended