• 8 years ago
Mental Madhilo is a Telugu romantic drama. Produced by Pellichoopuli fame Raj Kandukuri under Dharmapatha Creations, written and directed by Vivek Athreya. Raj Kandukuri.

విభిన్నమైన కథా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం ఎప్పటికప్పుడు రుజువు అవుతున్నది. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రాలు కూడా భారీ సినిమాలను తలదన్నేలా సక్సెస్ సాధించాయి. అంతేకాకుండా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. అలాంటి చిత్రాల జాబితాలో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, ఫిదా లాంటి చిత్రాలు చోటు సంపాదించుకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విడుదలకు ముందే మరో చిన్న చిత్రం 'Mental మదిలో' విశేషమైన టాక్‌ను సంపాదించుకొన్నది.
పెళ్లిచూపుల లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత రాజ్ కందుకూరి మెంటల్ మదిలో సినిమాకు ప్రొడ్యూసర్. అలాంటి నిర్మాత చేతిలో అశ్లీలం, ద్వందార్థాలకు ఎక్కడా తావులేకుండా చక్కటి కుటుంబ కథా చిత్రంగా రూపొందుకున్నది మెంటల్ మదిలో.
అరవింద్ కృష్ణ (శ్రీవిష్ణు) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. చిన్నప్పటి నుంచి ప్రతీ విషయంలోనూ కన్ఫ్‌ఫ్యూజన్ (తికమకపడటం) కలిగిన వ్యక్తి. ఆడవాళ్లకు ఆమడదూరంలో ఉంటాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న అరవింద్‌కు స్వేచ్ఛ (నివేదా పేతురాజ్)‌తో పెళ్లి కుదురుతుంది. స్వేచ్ఛ ఆధునిక భావాలు ఉన్న మహిళ. తనపై తనకు పూర్తి క్లారిటీ ఉన్న యువతినే కాక ఎదుటివారికి ఏమి కావాలనే స్పష్టత కూడా స్వేచ్ఛకు ఉంటుంది. ఇలాంటి భిన్న లక్షణాలు ఉన్న ఇద్దరు ఒకరిని మరొకరు బాగా ఇష్టపడుతారు. వీరిద్దరి నిశ్చితార్థానికి ముహుర్తం పెట్టుకొంటారు. కానీ ఓ కారణంగా ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ పనిమీద అరవింద్‌ ముంబైకి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఎంగేజ్‌మెంట్ కాకుండా పెళ్లి రద్దు చేసుకొందామా? అని స్వేచ్ఛను అరవింద్ అడగుతాడు. దాంతో స్వేచ్ఛ ఒక్కసారిగా కంగుతింటుంది.

Recommended