• 7 years ago
Fans accuse Anirudh Ravichander of being a copycat. Kalyana Vayasu similar to Sannan’s Don’t Lie

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ దక్షిణాదిలో ఓ సంచలనం అనే చెప్పొచ్చు. అనిరుద్ అందిస్తున్న సంగీతం యువతని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. తాజగా అనిరుద్ స్వరపరచిన కల్యాణ వయసు అనే సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. నయనతార నటిస్తున్న కొలమవు కోకిల చిత్రంలోనిది ఈ పాట. నటుడు యోగి బాబు పెర్ఫామెన్స్ తో ఈ సాంగ్ సోషల్ మీడియాని దున్నేస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో 5 మిలియన్ల వ్యూస్ పొందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజగా సాంగ్ విషయంలో అనిరుద్ విమర్శలు ఎదుర్కొనవలసి వస్తోంది.
కళ్యాణ్ వయసు అనే సాంగ్ విషయంలో అనిరుధ్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ సాంగ్ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సాంగ్ ని అనిరుద్ కాపీ చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సన్నన్ ఆల్బమ్ నుంచి వచ్చిన డోంట్ లై అనే సాంగ్ నుంచి ట్యూన్ ని అనిరుద్ కాపీ చేశాడంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ రెండు పాటలని వింటే ట్యూన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నట్లు అనిపించకమానదు. అనిరుద్ ఈ సాంగ్ నుంచే కాపీ చేసాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కాపీ చేసినందుకు థాంక్స్, దీని ఒరిజినల్ సాంగ్ అద్భుతంగా ఉంది అంటూ పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Recommended