Keerthy Suresh Marriage Update : టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ వివాహ ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు పెళ్లికి సంబంధించిన వివరాలను శుక్రవారం స్వయంగా ఆమె వెల్లడించారు. కీర్తి సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలేశుని దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కీర్తి సురేశ్, తన పెళ్లి వేడుక వచ్చే నెలలో గోవాలో జరగనుందని చెప్పారు.
Category
🗞
NewsTranscript
00:30.
01:00.