• 7 years ago
Akkineni Akhil's Ex-girlfriend Shriya Bhupal is going to enter the wedlock soon with Anindith Reddy, the grandson of Apollo hospitals chairman and founder Pratap C Reddy. Shriya Bhupal was supposed to the knot with Akhil Akkineni but the wedding was called off because of several unknown reasons.
#AkkineniAkhil
#ShriyaBhupal
#ramcharan

అక్కినేని అఖిల్ మాజీ ప్రేయసి శ్రీయా భూపాల్ వివాహం ఘనంగా జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగిన ఈ వివాహానికి సినీ, రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు సంబంంధించిన అతిసన్నిహితులు హాజరయ్యారు. శ్రీయా పెళ్లాడిన అనిందిత్ రెడ్డి మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ సతీమణి ఉపాసన కామినేని కు దగ్గరి బంధువు అనే విషయం తెలిసిందే. విదేశాల్లో జరిగిన పెళ్లికి రాంచరణ్‌తో కలిసి హాజరయ్యానని ఉపాసన వెల్లడించారు.
తన సోదరుడు అనిందిత్ రెడ్డికి పెళ్లికి హాజరైనట్టు ఉపాసన కామినేని ట్వీట్ చేశారు. కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరయ్యాను. రాంచరణ్‌తో కలిసి హాజరయ్యాను అని చెర్రీతో దిగిన ఫొటోను ట్వీట్టర్‌లో పోస్టు చేశారు. అనిందిత్ రెడ్డి పెళ్లి ఇటీవల ప్యారిస్‌లో వైభవంగా జరిగింది.
మిస్టర్ సీ (రాంచరణ్)తో గడిపిన మధురమైన క్షణాలను మరిచిపోలేను. అందుకు రాంచరణ్‌కు థ్యాంక్స్. అందమైన దుస్తులను డిజైన్ చేసిన సందీప్ కోస్లాకు అభినందనలు అని మరో ట్వీట్‌లో ఉపాసన పేర్కొన్నారు.
అపోల్ హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవుడు అనిందిత్ రెడ్డితో శ్రీయా భూపాల్ నిశ్చితార్థం ఏప్రిల్ 22న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నిశ్చితార్థ వేడుకకు రాంచరణ్, ఉపాసన హాజరైన సంగతి తెలిసిందే. ఉపాసనకు అనిందిత్ రెడ్డి తమ్ముడి వరుస అవుతుంది.

Recommended