• 8 years ago
Madurai-based elderly couple Kathiresan and Meenakshi, who have been waging a legal war claiming that actor Dhanush was their son, on Thursday said superstar Rajinikanth knowns fully well about the paternity of his son-in-law. In a letter to Rajini

మిళ హీరో ధనుష్ తమ కుమారుడేనంటూ వాదిస్తున్న మేలూరు వృద్ధ దంపతులు.. ఆయన మామ, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. అభిమానులను ఉద్దేశించి రజనీ చెప్పిన నీతి సూత్రాలను తిరిగి ఆయనకే ఎక్కుపెట్టారు. తల్లిదండ్రుల గురించి అభిమానులకు రజనీ చేస్తున్న హితబోధ.. కాస్త ఆయన అల్లుడు ధనుష్ కు కూడా చేస్తే బాగుంటుందని అంటున్నారు.
రజనీ చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి ఆయనే ఆత్మ పరిశీలన చేసుకోవాలని మేలూరు వృద్ధ దంపతులు కోరుతున్నారు. తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని చెప్పిన రజనీ... ఇదే విషయాన్ని ధనుష్‌కు కూడా చెప్పాలని సూచించారు. ఈ మేరకు ధనుష్ తండ్రిని అని చెప్పుకుంటున్న కదిరేశన్.. రజనీకాంత్‌కు ఒక లేఖ రాయడం గమనార్హం.
'ధనుష్ మా కుమారుడే అనే విషయం రజనీకాంత్ కు కూడా తెలుసు. అయినా స్పందించకపోవటం దారుణం' అని వారు వాపోతున్నారు. ధనుష్‌ తన కొడుకేనన్న విషయం ఆయన మామ, తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు కూడా బాగా తెలుసన్నారు. ఎలాగైనా ధనుష్ తమ వద్దకు వచ్చేలా రజనీ చర్యలు తీసుకోవాలని కోరారు.
ధనుష్‌ నుంచి తమకు ఒక్క పైసా అక్కర్లేదని.. తమను తల్లిదండ్రులుగా అంగీకరిస్తే అంతే చాలని ధీనంగా చెబుతున్నాడు. తాను రాస్తున్న ఈ లేఖను చూసైనా రజనీకాంత్‌ ధనుష్‌కు బుద్ధి చెప్పి తమ వద్దకు పంపాలని కదిరేశన్‌ కన్నీళ్లతో వేడుకున్నారు.

Category

People

Recommended