• 6 years ago
Iron leg Sastry son prasad entered into Tollywood. He wants to continue his father legacy. He started acting with Jambalakikdi pamba. In this occassion, He spoke to media and reveals his life journey.

ఐరన్ లెగ్ శాస్త్రి అంటే హాస్యానికి చిరునామా. హావభావాలతోనే ఆయన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కెరీర్ మంచి రేంజ్‌లోనే ఉండగానే ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దాంతో ఆయన అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. ఐరెన్ లెగ్ శాస్త్రి మరణానికి సంబంధించిన విషయాలను ఆయన కుమారుడు ప్రసాద్ వెల్లడించారు. తన తండ్రి మరణం తర్వాత ఎదురైన పరిస్థితులను తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన ఏమన్నారంటే..
మా నాన్న ఐరెన్ లెగ్ శాస్త్రి చాలా సినిమాల్లో నటించినా పెద్దగా ఆస్తులు కూడబెట్టుకోలేకపోయారు. అవకాశాలు తగ్గడంతో హైదరాబాద్ నుంచి మా సొంత ఊరు తాడేపల్లిగూడెంకు వెళ్లాం. అక్కడే సొంత ఇంట్లోనే మా నాన్నగారు ఉండేవారు. మేమే హైదరాబాద్‌లో ఉండేవాళ్లం.
మా కుటుంబం పౌరహిత్యంపై ఆధారపడటంతో కష్టంగా ఉండేది. శరీరం భారీగా పెరిగిపోయింది. ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అలాంటి పరిస్థితుల్లో మా నాన్నకు గుండెపోటు వచ్చింది. మేము ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్నాం. వెంటనే మా బంధువులు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ రాత్రి మేము ట్రైన్ ఎక్కాం. అదే రాత్రి ఆయన కన్నుమూశారు. చివరి చూపు, మాట చూసుకోలేకపోయాం అని ప్రసాద్ అన్నారు.
మేము ట్రైన్ దిగి హాస్పిటల్‌కు వెళ్తున్నాం. ఎదురుగా రిక్షాలో మా నాన్న పార్ధీవ దేహం. కేవలం బాడీ మాత్రమే రిక్షాలో ఉంది. తల, కాళ్లు, చేతులు రిక్షా బయట వేలాడుతూ ఉన్నాయి. అలా మా నాన్నను రిక్షాలో లాక్కెల్లడం చూసి మా అమ్మ కళ్లు తిరిగి కింద పడిపోయారు.

Recommended