• 7 years ago
Top leader Jampanna surrendered before the Telangana police along with his wife Anitha on Monday. He along with his wife and son-in-law had come to orphanage home where his mother was staying. Jampanna's eyes filled with tears when he saw his mother.

33ఏళ్ల అజ్ఞాతవాసం అనంతరం మావోయిస్టు పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసిన జంపన్న.. సోమవారం తన కన్నతల్లిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భావోద్వేగ వాతావరణం నెలకొంది.
దశబ్దాల తర్వాత తన వద్దకు వచ్చిన జంపన్నతో.. ఇన్నాళ్లూ గుర్తుకు రాలేదా బిడ్డా అంటూ ఆయన తల్లి యశోద కన్నీటిపర్యాంతమైంది. తన తల్లిని చూసిన ఆనందంలో భావోద్వేగానికి గురైన జంపన్న కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
జంపన్న సోమవారం హైదరాబాద్‌లో డీజీపీ సమక్షంలో లొంగియిని విషయం తెలిసిందే. అనంతరం కాజీపేట ప్రశాంత్‌నగర్‌లోని సహృదయ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తన తల్లిని కలుసుకున్నారు.
ఇన్నాళ్లు తాను గుర్తుకు రాలేదా? బిడ్డా అని తల్లి యశోదా ప్రశ్నించగా.. నేను నీకు ఎంత దూరంగా ఉన్నానో నా మనసు నీకు అంత దగ్గరగా ఉంది. పార్టీలో ఉన్నప్పుడు ఇవన్ని బయటికి కన్పించకూడదు. నాలో నేను దాచుకున్నాను. క్షమించు తల్లి' అంటూ జంపన్న భావోద్వేగానికి గురయ్యారు.

Category

🗞
News

Recommended