• 7 years ago
Tamil Nadu Governor Banwarilal Purohit held a press conference on Tuesday evening to clear his name from a controversy surrounding a professor arrested in the case. However, the Governor walked into another row when he patted the cheek of a woman journalist, without her consent, seemingly to dodge her question.

ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు వ్యవహరించే తీరు కొన్ని సమయాల్లో వివాదంగా మారుతోంది.
తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్‌ పురోహిత్‌ రాజ్‌భవన్‌లో మహిళా జర్నలిస్టు చెంపను తాకి ఇరుకున పడ్డారు. ఈ విషయమై ఆ జర్నలిస్టు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గవర్నర్ చర్యను తప్పుబట్టారు. విద్యార్థినులను లైంగిక కార్యకలాపాలకు ప్రేరేపించిందనే ఆరోపణలపై మధురై కామరాజ్‌ అనుబం ధ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర‍్మలాదేవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆ ప్రోఫెసర్ తనకు గవర్నర్ పరిచయం ఉందని ప్రకటించింది. చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన వెలుగుచూడడంతో ఆ రాష్ట్ర గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఈ తరుణంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఈ విషయమై మంగళవారం నాడు రాజ్‌భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఆ మహిళా ప్రోఫెసర్ ఎవరో కూడ తనకు తెలియదన్నారు. విలేకరుల సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ వేదికపై నుండి దిగి వెళ్ళిపోతున్న సమయంలో ఓ మహిళా జర్నలిస్టు ఇదే విషయమై మరోసారి గవర్నర్‌ను ప్రశ్నించింది.
అయితే గవర్నర్ సమాధానం చెప్పకుండా తన చెంపను తాకినట్టుగా ఆమె ట్వీట్ చేశారు. ఒక మహిళ అనుమతి లేకుండా ఆమెను తాకడం మంచి పద్దతి కాదన్నారు. తన ముఖాన్ని పదే పదే శుభ్రం చేసుకొన్నానని ఆమె చెప్పారు. మీరు నాకు తాతయ్య లాంటి వారే కావొచ్చు, కానీ మీ చర్య నాకు తప్పుగా అనిపిస్తోందని ఆ జర్నలిస్టు ఆ ట్వీట్‌లో అభిప్రాయపడ్డారు.

Category

🗞
News

Recommended