• 7 years ago
A girl was found passed in a hotel in Bhiwandi area and the cause was an overdose power injection! The girl, 29-year old resident from Rashid Compound, Mumbra had gone to Bhiwandi with her boyfriend, hailing from Kalyan. The couple stayed in Ashoka Hotel on the Kalyan Naka in Bhiwandi. The girl took a boosting injection while they were in the hotel on April 8.

బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మరణించింది. లాడ్జీ గదిలో అనుమానాస్పదస్థితిలో మరణించిన వివాహిత కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటన మహరాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకొంది.
మహరాష్ట్రలోని భీవండికి చెందిన ఓ వివాహితకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. భీవండిలోని ముంబ్రా ప్రాంతంలో ఆమె నివాసం ఉంటుంది. అయితే ఆమెకు ఓ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అయితే ఆమె అప్పుడప్పుడు అతడితో బయటకు వెళ్ళేదని స్థానికులు అంటున్నారు.
అయితే బాయ్ ఫ్రెండ్‌తో లైంగిక సుఖం కోసం ఇటీవల ఆమె బయటకు వెళ్ళింది. ఇద్దరి పిల్లలను ఇంట్లోనే వదిలి వివాహిత బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంజాయ్ చేసేందుకు బయటకు వచ్చింది. భీవండి ప్రాంతంలోని ఓ లాడ్జీని తీసుకొన్నారు. అయితే లైంగిక ఆనందం కోసం దగ్గు మందు బాటిళ్ళను తాగింది. దీనికి తోడు మద్యం తీసుకొంది.వీటికి తోడు డ్రగ్స్ కూడ తీసుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. వీటన్నింటి కారణంగా ఆమె స్పృహ కోల్పోయింది.
శరీరంలోకి మోతాదుకు మించి మత్తును నింపే మందులు ప్రవేశించడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఎంత లేపినా వివాహిత లేవలేదు. దీంతో భయపడిన బాయ్‌ఫ్రెండ్ లాడ్జీ గదిలోనే ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. హోటల్ సిబ్బందికి కనీసం సమాచారం కూడ ఇవ్వలేదు.
హోటల్ గది తలుపులు ఎంతకు తెరవలేదు. ఈ తరుణంలో హోటల్ తలుపులను పగులగొట్టారు. అప్పటికే హోటల్‌రూమ్‌లో వివాహిత అపస్మారక స్థితిలో ఉంది. వెంటనే హోటల్ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు ప్రకటించారు.

Category

🗞
News

Recommended