Ram Charan Boyapati Film Sold To 74 Crore

  • 6 years ago
Latest update is that UV Creations has owned the rights of Ram Chara-Boyapati upcoming film RC12 at around 74 crores on the basis of a non-returnable agreement.

తన సినిమాకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే.... ఏ హీరో అయినా వద్దంటాడా? కచ్చితంగా అనరు. కానీ రామ్ చరణ్ తీసుకున్న నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. దీని వల్ల నిర్మాతకు రూ. 15 కోట్ల వరకు తక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న ఆర్‌సి12 విషయంలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో జరిగే వ్యాపారం ఎలా ఉంటుందంటే.... ఒక హీరో సినిమా షేర్ ఎంత వసూలు చేస్తే, అతడి నెక్ట్స్ సినిమా అదే రేటుకు అమ్ముడుపోతుంది. రామ్ చరణ్ గత చిత్రం ‘రంగస్థలం' రూ. 125 కోట్లకుపైగా గ్రాస్, రూ. 92 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. ఈ లెక్క ప్రకారం ఆర్‌సి12 థియేట్రికల్ రైట్స్ కనీసం రూ. 90 కోట్లకు అమ్ముడు పోవాలి.
అయితే ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తూ ఆర్‌సి12 థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 74 కోట్లకే అమ్మారట డివివి దానయ్య. నాన్ రిటర్నబుల్ బేసిస్‌లో యూవి క్రియేషన్స్ వారు ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం.

Recommended