Gopichand's 'Oxygen' Movie Public Talk ! "ఆక్సీజన్" పబ్లిక్ టాక్

  • 7 years ago
Gopichand's much delayed film 'Oxygen' is finally hitting the theaters on this Thursday. The movie Produced by S. Aishwarya on Sri Sai Raam Creations banner, presented by A. M. Rathnam and directed by A. M. Jyothi Krishna.

హీరో గోపీచంద్‌కు ఈ మధ్య కాలంలో చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేవు. దీంతో కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ హీరో.... తాజాగా 'ఆక్సీజన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2003లో 'నీ మనసు నాకు తెలుసు', 2006లో 'కేడీ', 2012లో 'ఊ లా లా' లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎ.ఎం జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
రొటీన్ కమర్షియల్, ఫ్యామిలీ డ్రామాలు చేస్తూ వెలుతున్న గోపీచంద్ ఈ సారి కాస్త దేశభక్తిని, కాస్త సందేశాన్ని జోడించి 'ఆక్సీజన్'తో బాక్సాఫీసు బరిలో దూకారు.
పెర్ఫార్మెన్స్ పరంగా హీరో గోపీచంద్ అదరగొట్టాడు. అటు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కృష్ణ ప్రసాద్‌గా, ఇటు మిలట్రీ ఆఫీసర్ సంజీవ్‌గా బాగా నటించాడు. యాక్షన్ సీన్లలో బాగా చేశాడు. లుక్ పరంగా కూడా గోపీచంద్ ఆకట్టుకున్నాడు.
గోపీచంద్ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా, అను ఎమ్మాన్యూయేల్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. విలేజ్ గర్ల్‌గా రాశి ఖన్నా, మైక్రో బయాలజిస్టుగా అను ఎమ్మాన్యూయేల్ ఇటు నటన పరంగా, అటు అందం పరంగా ఓకే అనిపించారు.