• 7 years ago
Mersal is the latest Tamil film in the discussions. Popular Tamil distributor Abhirami Ramanthan made some sensational comments on the film. The distributor has commented that the makers are projecting the fake collections.
దీపావళికి విడుదలైన చిత్రం 'మెర్సల్' ఇపుడు తమిళనాడులో హాట్ టాపిక్. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని, రజనీకాంత్ 'యంతిరన్'(రోబో) తర్వాత ఈ ఫీట్ అందుకున్న రెండవ తమిళ చిత్రం ఇదే అంటూ ప్రచారం జరుగుతోంది. విజయ్ నటించిన ఈ మూవీ ఇప్పటికే 'జిఎస్టీ' వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ విషయంలో వివాదం నెలకొంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అభిరామి రామనాథన్ ఈ సినిమా కలెక్షన్స్ ఫేక్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
‘మెర్సల్' మూవీ కలెక్షన్స్ అన్నీ ఫేక్ అని, ఈ సినిమా అంత వసూలు చేసిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఈ సినిమా రూ. 200 కోట్లు వసూలు చేసిందన్న ప్రచారాన్ని అస్సలు నమ్మ వద్దని అభిరామి రామనాథన్ అన్నారు.
చెన్నైలో పలు మల్టీప్లెక్స్ థియేటర్స్ చైన్ కలిగిన అభిరామి రామనాథన్ 1976 నుండి ఫిల్మ్ డస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో ఉన్నారు. ఇలాంటి ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ‘మెర్సల్' సినిమా విషయంలో ఈ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.

Recommended