• 2 days ago
తమిళనాడులో త్రిభాషా ఉద్యమం రోజు రోజుకి ఉధృతంగా మారుతుంది. తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దుతుగా బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. బీజేపీ నాయకురాలు తమిళిసై కోయంబేడులో సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని తమిళ పోలీసులు అడ్డుకున్నారు. తమిళిసైను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమంపై ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని తేల్చి చెప్పారు తమిళసై. ఇక ఈ విధానానికి మద్దుతుగా బీజేపీ నాయకుల, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవహగానా కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ ఈ తరహా కార్యక్రమాలు చేస్తుంటే డీఎంకే మాత్రం త్రిభాషా సూత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ మినహా మిగిలిన 58 పార్టీల అధ్యక్షులు, ప్రముఖ నేతలతో ఓ భారీ అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్టాలిన్. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్, తమిళ  వెట్రి కళగం పార్టీ తరపున విజయ్ కూడా స్టాలిన్ నిర్ణయానికి మద్దతు పలికారు. కమల్ హాసన్ నేరుగా ఆల్ పార్టీ మీటింగ్ కి రాగా...విజయ్ లేఖ రాశారు. ఈ పరిణామాల ఫలితంగా ఈరోడు బీజేపీ తమిళనాడులో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జోరు అందుకునేలా చేసింది. 

Category

🗞
News

Recommended