ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు గారి పేరును జనసేన ఖరారు చేసింది. శాసనసభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు కు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు జనసేన అధికారిక ప్రకటన చేసింది. నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకుంటామని గతంలోనే సీఎం చంద్రబాబు అధికారిక ప్రకటన చేయగా...ఇప్పుడు నాగబాబును మండలికి పంపిస్తుండటంతో త్వరలోనే ఆయన్ను మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. అయితే మధ్యలో నాగబాబుకు MLC ఇవ్వట్లేదని..ఆయన రాజ్యసభకు పంపించాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ జనసేన నాగబాబుకు MLC అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటంతో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి పదవి చేపట్టడం ఖాయమైంది. నామినేషన్ వేయటానికి నాగబాబు సిద్ధం కావాలని జనసేన అధినేత నుంచి ఇప్పటికే నాగబాబుకు సమాచారం వెళ్లింది. అందుకే జనసేన పార్టీ తరపున అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.
Category
🗞
News