• 2 days ago
MLC Teenmar Mallanna Press Meet : కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని, ఈడబ్ల్యూఎస్​ రక్షించుకోవడానికే కుట్ర పన్నారని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న తెలిపారు. కాంగ్రెస్​లో ఉంటే ప్రశ్నిస్తున్నాననే సస్పెండ్​ చేశారని అన్నారు. తనను బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశం ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న మాట్లాడారు.

బీసీ కులగణన తప్పని ప్రతులను కాల్చడం తప్పానని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న ప్రశ్నించారు. సమగ్ర కుటుంబ సర్వేను కేటీఆర్​ పకడ్బందీగా చేశారన్నారు. కులగణనలో అగ్రవర్ణాలను ఎక్కువగా చూపించారని ఆరోపించారు. బీసీ వర్గాలను అణిచిపెట్టే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్​ రక్షించుకోవడానికే కుట్ర పన్నారన్నారు. సర్వేకు బాధ్యత నాది అని సీఎం ఒప్పుకుంటారానని ప్రశ్నించారు. సర్వే తప్పని నిరూపించేందుకు తాను సిద్ధమని సవాల్​ విసిరారు. రేవంత్​ రెడ్డిపై కోమటిరెడ్డి బ్రదర్స్​ అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్​కు ఒక న్యాయం, నాకొక న్యాయమా అంటూ ప్రశ్నించారు. అంతర్గత ప్రజాస్వామ్యం అగ్రవర్ణాలకే ఉంటుందా, బీసీలకు ఉండదానని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న అడిగారు.

Category

🗞
News

Recommended