• 16 hours ago
Heavy Traffic at Araku Ghat Road : భూతల స్వర్గంగా పేర్కొనే విశాఖ జిల్లాలోని పర్యాటక కేంద్రం అయిన అరకులో ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఆంధ్ర ఊటీ అరకు లోయ పర్యాటకలతో కిటకిటలాడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి అరకు అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అరకు లోయ ఘాట్ రోడ్​లో ట్రాఫిక్ ఏర్పడింది. వచ్చే పోయే వాహనాలులతో ఘాట్ రోడ్డు రద్దీగా మారింది. దీంతో పాటుగా కాఫీ తోటల వద్ద ఏర్పాటు చేసిన ఉడెన్ స్టెప్స్ వద్ద పార్కింగ్ స్థలం లేకపోవడంతో వాహనాలు రహదారిపైనే నిలిపి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 300 వరకు వాహనాలు బారులు తీరాయి. అరకు లోయ విశాఖ మధ్య రాకపోకలు సాగించేందుకు మూడున్నర గంటల సమయం కాగా ట్రాఫిక్ రద్దీతో ఐదు గంటలు సమయం పడుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం కావడంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస సెలవులు కావడంతో అరకు లోయకి సందర్శకులు ఎక్కువగా వస్తున్నారు.

Category

🗞
News

Recommended