• 2 days ago
Priyanka Jain in Tirumala Prank Video Row : బిగ్‌బాస్ ఫేమ్‌ ప్రియాంక జైన్, బుల్లితెర నటుడు శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల క్షేత్రానికి వెళ్తూ అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించిందని వారిద్దరూ ప్రాంక్ వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టారు. ఈ వీడియోను కొన్ని రోజుల క్రితం చిత్రీకరించారు. నడక మార్గంలో చిరుత పులి దాడి అంటూ సామాజికమాధ్యమంలో వీడియో అప్‌లోడ్‌ చేయడంతో దానిపై తీవ్ర దుమారం రేగింది. భక్తులను భయాందోళలకు గురి చేసేటువంటి చర్యలకు పాల్పడటంపై ప్రియాంక జైన్, శివకుమార్​పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఫ్రాంక్ వీడియో ఆధారంగా వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.

Category

🗞
News
Transcript
01:30you

Recommended