• 7 years ago
Six years after her separation from Power star, Pawan Kalyan, former model-actor Renu Desai has finally found love again. The actress got engaged in a private ceremony in Pune earlier this week and says she’s ready for the next chapter in her life.

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ తీవ్రమైన నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటి వరకు తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉన్న ఆమె ఇక నుంచి ట్విట్టర్ ఖాతా నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకొన్నారు. తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని ప్రకటించిన వెంటనే కొందరు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రేణు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాను ఎందుకు ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నారో వివరణ ఇచ్చారు.
ట్విట్టర్‌లో చాలా ప్రతికూలత ఉందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతం, ప్రొఫెషనల్‌గా చిరాకుతో ఉండే వారు లేదా చాలా మంది తమ పేర్లతో కాకుండా ఫేక్ అకౌంట్లతో ఉన్నారు. అలాంటి వారికి రాజకీయ నేతలు, సినీ ప్రముఖులపై చాలా నెగిటివిటితో రాయడానికి ప్రయత్నించే వాళ్లు ఉన్నారు. అని రేణు ట్విట్టర్‌లో ఓ ప్రకటన చేశారు.
నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. అందుకే ఈ ప్రతికూల వాతావరణానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఈ నేపథ్యంలో నా ట్విట్టర్ అకౌంట్‌ నుంచి వైదొలగాలని (డీ యాక్టివేట్) నిర్ణయం తీసుకొన్నాను. ట్విట్టర్‌కు దూరంగా ఉంటాను అని రేణుదేశాయ్ తెలిపారు.

Recommended