• 7 years ago
Sri Reddy Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen. But Sri Reddy not achieved much glare from the producers. In this situation, She spoke to a youtube Channel and blasted about film industry. In this occassion, She shared few sensational post in her socail media page.

సినీ తార శ్రీరెడ్డిపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) కొంత రాజీపడినా క్యాస్టింగ్ కౌచ్ వివాదం తీవ్రత ఇంకా టాలీవుడ్‌లో తగ్గుముఖం పట్టలేదు. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌పై బాంబు పేల్చిన శ్రీరెడ్డి.. తాజాగా నిర్మాత వాకాడ అప్పారావుపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవికి కూడా లాగే ప్రయత్నం చేస్తున్నది.
ఏప్రిల్ 12వ తేదీ (గురువారం) రాత్రి మహాటీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో వర్థమాన నటులు శృతి, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. వారంతా నిర్మాత వాకాడ అప్పారావు గురించి సంచలన విషయాలు బయట పెట్టారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడని, పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఘాటుగా స్పందించారు. ‘మెగాస్టార్ చిరంజీవి గారు ఇతను మీ పేరు చెప్పుకుని ఎంతో మంది ఆడవారి జీవితాలను నాశనం చేసాడు, దయచేసి ఇటువంటి వారిని ప్రోత్సహించకండి' అని శ్రీరెడ్డి ట్వీట్ చేసింది.
వందలాది మంది ఔత్సాహిక మహిళా నటులను శారీరకంగా వాడుకొన్నాడు. లైంగికంగా వేధించాడు. 16 ఏళ్ల అమ్మాయిలు కావాలని డిమాండ్ చేస్తాడు అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావుపై బాంబు పేల్చింది.
మా అసోసియేషన్ మెట్టుదిగి రావడంతో శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. క్యాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి చేస్తున్న పోరాటానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హైదరాబాద్‌కు వచ్చినట్లయితే శ్రీరెడ్డిని కలుస్తాను. ఆమె చేతితో ఆటోగ్రాఫ్ తీసుకొంటాను అని వర్మ లైవ్‌లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Recommended