Actress Sanjana who was seen in a couple of Telugu films in the past is now coming up with a Telugu TV soup titled as Swarna Kadgam. he actress said that she has put on weight for the character she is playing in a TV serial.
దాదాపు పదేళ్ల క్రితం 'బుజ్జిగాడు' సినిమాతో సెకండ్ హీరోయిన్‌గా తెలుగులో కెరీర్ ప్రారంభించిన బెంగుళూరు బ్యూటీ సంజన ఆ తర్వాత హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే స్థాయిలో మంచి క్యారెక్టర్ పడకపోవడం కూడా ఇందుకు కారణం అయుండొచ్చు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో సంజనకు ఇలాంటి ప్రశ్నే ఎదురవ్వగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు తాను చేస్తున్న 'స్వర్ణ ఖడ్గం' గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
నేను ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్, గాడ్ పాదర్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. తెలుగులో కంటే కన్నడలో ఎక్కువ గుర్తింపు వచ్చింది. అందులోనూ నేను బెంగుళూరు అమ్మాయిని కావడం బాగా కలిసొచ్చింది. హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండక పోవడం కూడా తెలుగులో అవకాశాలు తక్కువ రావడానికి ఓ కారణం అని సంజన తెలిపారు. నేను బెంగుళూరు అమ్మాయిని కావడం, అక్కడే ఉంటుండటం వల్ల కన్నడ ఇండస్ట్రీలో పెద్ద అడ్వాంటేజ్ అయిందని తెలిపారు.
నా కెరీర్లో ఇప్పటి వరకు 45 సినిమాల్లో నటించాను, మలయాళంలో సూపర్ స్టార్లతో కలిసి చేశాను. పదేళ్లుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇటీవలే సైన్ చేశాను. నాతో పాటు పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన అమ్మాయిలను ఇపుడు చూస్తే లావుగా డ్రమ్ముల్లా తయారయ్యారు, కొందరైతే ముగ్గురు నలుగురు పిల్లలను కనేశారు. పెళ్లి కాని వారు అవకాశాల్లేక డిప్రెషన్లోకి వెళ్లిపోయారు... అని సంజన అన్నారు.

Category
🎥
Short film