• 8 years ago
Producer rape attack on me, says Actress Gayathri Gupta. But his name was not revealed. Actress Gayatri Gupta also said some interesting comments about casting couch in a recent interview.

తనపై ఆత్యాచారం జరిగినట్లు 'ఫిదా' ఫేం గాయిత్రి గుప్తా వెల్లడించారు. హీరోయిన్ అవ్వాలనే ఆశతో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే తాను ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ వెబ్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఇంకొక అమ్మాయికి రాకుండా నేను ఏదైనా చేయాలని ఆలోచించానని గాయిత్రి తెలిపారు. అప్పుడే బలంగా నిర్ణయించుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలను వదిలేయకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. ఆత్యాచారం జరిగినపుడు నేను భయపడ్డాను. ఇంట్లో చెబితే ఇండస్ట్రీని కెరీర్ గా ఎంచుకున్నావు కాబట్టే ఇలా జరిగిందని చెప్పి హౌస్ అరెస్ట్ చేస్తారు. అందుకే ఇంట్లో చెప్పలేదు. ఒకరోజు ఎమోషనల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యాను.... అని తెలిపారు.
ఆత్యాచారం జరిగినపుడు మీరు ఎవరికీ కంప్లయింట్ ఇవ్వలేదా? అనే ప్రశ్నకు గాయిత్రి స్పందిస్తూ.... నా దగ్గర కంప్లయింట్ ఇవ్వడానికి ఎలాంటి ఆధారం లేదు. అలాంటి లేనపుడు మనం ఏం చేసినా లాభం ఉండదు. అపుడు నాకు కంప్లయింట్ ఇద్దామనేంత దైర్యం కూడా లేదు.

Recommended