Skip to playerSkip to main contentSkip to footer
  • 6/4/2018
Film Nagar source said that, Tollywood Young Hero Marriage in Trouble. This Actor Youngest son of a popular Actor. People close to the family says that the copule has already applied for saperation .
#Tollywood
#Marriage

టాలీవుడ్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి విడాకుల వ్యవహారం గురించిన షాక్ నుండి ఇండస్ట్రీ జనాలు ఇంకా తేరుకోక ముందే మరో డైవోర్స్ కేసు హాట్ టాపిక్ అయింది. ప్రముఖ తెలుగు సినీ ఫ్యామిలీకి చెందిన యువ హీరో కూడా ఇదే బాటలో నడుస్తున్నాడని, త్వరలోనే అతడు విడాకులు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇండస్ట్రీకి చెందిన బడా సినీ ఫ్యామిలీకి చెందిన స్టార్ కావడంతో ఎవరూ ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దర్శకుడు క్రిష్‌కు మంచి పేరు తెచ్చిన మల్టీస్టారర్ మూవీలో ఈ యంగ్ హీరో ఒక కథానాయకుడిగా నటించాడు. ఇతగాడి తండ్రి ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రమశిక్షణకు మారు పేరుగా ఆయన్ను చెప్పుకుంటారు. ముక్కుసూటిగా ఉండే ఆయనంటే ఇండస్ట్రీలో చాలా మందికి గౌరవం.
మూడేళ్ల క్రితం ఈ యంగ్ హీరో వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాల నుండి ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే సంవత్సరం తర్వాత భార్య భర్తల మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయని సమాచారం. ఇద్దరి కలిపేందుకు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా, కౌన్సిలింగ్ ఇచ్చినా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది.

Recommended