• 6 years ago
Telugu cinee actress Krishna Kumari passed away, She was the contemporary of Savitri in Telugu Film world.

అలనాటి నటి కృష్ణకుమారి కన్ను మూశారు. ఆమె వయస్సు 83 ఏళ్లు. ఆమె 1933 మార్చి 6వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని నైహతిలో జన్మించారు. ఆమె తెలుగులో 130కి పైగా సినిమాల్లో నటించారు.
ప్రముఖ నటి సావిత్రికి సమకాలీనురాలైన కృష్ణ కుమారి అప్పటి అగ్ర హీరోలందరి సరనసన నటించారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కాంతారావు, కృష్ణంరాజు, డాక్టర్ రాజ్‌కుమార్, శివాజీ గణేషన్, జగ్గయ్య వంటి హీరోలందరి పక్కన నటించి ప్రేక్షకులను అలరించారు.
ఆమె తల్లిదండ్రులు తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వెంకోజీ రావు, సచీ దేవి. ఆమె కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందింది. ఆమె సోదరి షావుకారు జానికి కూడా అప్పట్లో తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా అలరించారు. కృష్ణకుమారి సినీ రంగ ప్రవేశం 1951లో నవ్వితే నవ్వారు సినిమాతో ప్రారంభమైంది. పలు తమిళ సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఆమె నటించిన భార్యాభర్తలు (1961), వాగ్దానం (1961), కులగోత్రాలు (1962), గుడి గంటలు (1964) సినిమాలు క్లాసిక్స్‌గా ప్రసిద్ధి గాంచాయి. కన్నడంలో చాలా తక్కువ సినిమాలే చేసినప్పటికీ ఎక్కువగా రాజ్‌కుమార్ సరసన నటించారు. ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ సంపాదకుడు, స్క్రీన్ మ్యాగజైన్ వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త అజయ్ మోహన్ ఖైతాన్‌ను వివాహమాడారు. ఆమె తన కూతురు, అల్లడు, మనవళ్లతో బెంగళూరులో నివసిస్తూ వచ్చారు.

Recommended