• 7 years ago
Abhimanyudu movie box office collections. Vishal gets hit after long time
#Abhimanyudumovie
#Vishal


తెలుగు పందెం కోడి విశాల్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి విజయదాహాన్ని అభిమన్యుడు చిత్రం తీర్చింది. సమంత, విశాల్ జంటగా నటించిన అభిమన్యుడు చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికే ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు టైం కూడా బాగా కలసి వచ్చింది. రంగస్థలం, మహానటి చిత్రం తరువాత సమంత బుట్టలో మరో హిట్ పడింది.
హీరో విశాల్ పేరు ఈ మధ్య ఎక్కువగా న్యూస్ లో వినిపిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ విశాల్ సినిమాలు మాత్రం విజయానికి నోచుకుని చాలా కాలమే అవుతోంది. ఎట్టకేలకు పందెం కోడి అభిమన్యుడు చిత్రంతో సత్తా చాటాడు.
అభిమన్యుడు చిత్రంలో విశాల్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటించారు. సైబర్ వార్ నేపథ్యంలో దర్శకుడు మిత్రన్ ఈ చిత్రాన్ని ఆసక్తికరమైన థ్రిల్లర్ గా తెరకెక్కించారు.
జూన్ 1 న ఈ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అభిమన్యుడు చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఫలితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. డబ్బింగ్ చిత్రంగా వచ్చిన అభిమన్యుడు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషమే.

Recommended