• 7 years ago
Allu Arjun and Vakkantham Vamsi disappointed with Naa Peru Surya. Huge losses in US

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల నటించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. దేశభక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రం మే 4 న విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయిందనే చెప్పాలి. తొలి షో నుంచే ఈ చిత్రానికి డివైడ్ టాక్ మొదలైంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో బోర్డర్ కు వెళ్లలనే కోరిక ఉన్న ఆర్మీ మాన్ గా నటించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లినట్లు తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ చిత్రంలో బన్నీ, అర్జున్ మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ మిగిలిన కథనంలో బలం లేకపోవడంతో అల్లు అర్జున్ ఫాన్స్ సైతం నిరాశపడ్డారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అందరికి నిరాశనే మిగిల్చింది.
ఈ చిత్రంలో తన లుక్ విషయంలో, యాక్షన్ సీన్స్ లో బన్నీ చాలా కష్టపడి చేశాడు. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన తొలి చిత్రం ఇది. నాపేరు సూర్య చిత్ర రిజల్ట్ వీరిద్దరిని తీవ్రంగా నిరాశపరిచినట్లు తెలుస్తోంది. బన్నీ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ కోసం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recommended