• 6 years ago
Naa Peru Surya Na Illu India movie highlights. Naa Peru Surya, Naa Illu India film written and directed by Vakkantam Vamsi (in his directorial debut). Produced by Shirisha and Sridhar Lagadapati under the banner Ramalakshmi Cine Creations, it stars Allu Arjun and Anu Emmanuel in the lead roles. The film will be released in Tamil as En Peru Surya En Veedu India, and in Malayalam as Ente Peru Surya Ente Veedu India.
#NaaPeruSurya
# AlluArjun
#VakkantamVamsi

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన 'నా పేరు సూర్య' చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారంతా అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. వక్కంతం వంశీ ఫస్ట్ డైరెక్షన్ అయినప్పటికీ అద్భుతంగా సినిమాను హ్యాండిల్ చేశాడని అంటున్నారు. సినిమాలో దేశభక్తి అంశాన్ని చాలా బాగా ఫోకస్ చేశారని, ఈ సినిమా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా అనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సైనికులపై గౌరవం మరింత పెంచేలా ఈ సినిమా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓ పబ్ సీన్ తో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ మొదలవుతుందని, ఇందులో బన్నీ పెర్ఫార్మెన్స్ విజిల్స్ కొట్టే విధంగా ఉందని, ఇండియా థీమ్ సాంగుతో సినిమా మొదలైన తీరు బావుందనే టాక్ వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్ ఫైట్ సీన్ చాలా బాగా చిత్రీకరించారని అంటున్నారు.
సినిమాలో ఆర్మీ ట్రైనింగ్ ఎపిసోడ్, దేశం కోసం సైనికులు ఎలాంటి త్యాగాలు చేస్తున్నారనే అంశాలు ఫోకస్ చేసిన తీరు సూపర్బ్ గా ఉంది. ఓ సైనిక సాంగ్ రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించారు. తెలుగులో ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త మిలటరీ బ్యాక్ డ్రాప్‌తో మూవీ సాగుతుంది.
సినిమాలో లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో సాంగ్ తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమాలో లేని విధంగా భిన్నంగా తీశారు. యూఎస్ఏలో చిత్రీకరించిన ఈ పాట అల్లు అర్జున్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతి సీన్లో అల్లు అర్జున్ హార్డ్ వర్క్ కనిపిస్తోందని, సూర్య పాత్రలో బన్నీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారనే అభిప్రాయాలు ఆడియన్స్ నుండి వ్యక్తం అవుతోంది. అతడి పాత్రలో యాంగ్రీనెస్, దేశ భక్తి దర్శకుడు అద్భుతంగా ఫోకస్ చేశాడని అంటున్నారు.

Recommended