మనసుకు నచ్చింది రివ్యూ

  • 6 years ago
Manasuku Nachindi movie Review. Manasuku Nachindi directed by debutant Manjula Ghattamaneni and is being jointly produced by Sanjay Swaroop and P.Kiran under his banner Anandi Art Creations. catch here the review of Manasuku Nachindi


మంజుల ఘట్టమనేని.... నటిగా రాణించాలనే తన కలకు దూరమైనా.... నిర్మాతగా మారి తన మనసుకు నచ్చిన సినిమాలు నిర్మించారు. ఇపుడు అంతకంటే ఇష్టమైన రచన, దర్శకత్వం వైపు అడుగులు వేశారు. 'మనసుకు నచ్చింది' అనే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల మనసును ఏమేరకు మెప్పింది? తొలి సారి మెగా ఫోన్ పట్టిన మంజుల ఏ మేరకు తన సత్తా చాటారు. అనేది రివ్యూలో చూద్దాం.
సూరజ్(సందీప్ కిషన్), నిత్యా( అమైరా దస్తూర్) చిన్నతనం నుండి కలిసే పెరుగుతారు. బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం. ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్ బాండింగ్ చూసి వీరు ప్రేమించుకుంటున్నారని అపోహపడిన పెద్దలు ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ ఇద్దరి మధ్య పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మాత్రం ఉండదు.పెద్దల మాటను కాదనలేక పెళ్లి పిటల వరకు వెళతారు. తీరా ముహూర్తం సమయానికి ఇద్దరూ ఒకరితో ఒకరు లేచిపోతారు. కొంతకాలం తమకు నచ్చినట్లు ఉండాలని ఉద్దేశ్యంతో గోవా పారిపోతారు.
ఈ సినిమా కథలోని అసలు పాయింట్ ఏమిటంటే.... మనం కళ్లతో చూసి ఇష్టపడినవి అన్నీ మన మనసు స్వీకరించదు. దానికంటూ ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒకసారి మనసు ఇష్టపడితే అది జీవితాంతం అలాగే ఉండిపోతుంది. మనసు ఇష్టపడింది దక్కకపోతే ఆ పెయిన్ జీవితాంతం ఉంటుంది. మన మనసుకు నచ్చింది చేసినపుడే జీవితాంతం సంతోషంగా ఉంటారు అనే చెప్పే ప్రయత్నంచేశారు. హీరో హీరోయిన్...... తమ కళ్లకు నచ్చింది ఏది, మనసుకు నచ్చింది ఏది అని తెలుసుకోవడానికి పడ్డ సంఘర్షణే మిగతా కథ.
సందీప్ కిషన్ ఈ చిత్రంలో పెద్ద ఫోటోగ్రాఫర్ కావాలనే కలలు కనే కుర్రాడి పాత్రలో కనిపించాడు. కళ్లకు నచ్చిన అమ్మాయి వేరు, మనసుకు నచ్చిన అమ్మాయి వేరు..... ఇలా సంఘర్షణ పడే పాత్రలో సందీప్ కిషన్ బాగా నటించాడు.

Recommended