• 7 years ago
Ajith's 'Vivegam' breaks Allu Arjun's Sarrainodu record. Vivegam got 8 million views in 24 hours

తమిళంలో హీరో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అజిత్ సినిమా కోసం ఆయన అభిమానులు పిచ్చెక్కిపోతుంటారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ స్పీడ్ కు వివేగం చిత్రం బ్రేక్ వేసింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. అజిత్ ప్రస్తుతం విశ్వాసం చిత్రంలో నటిస్తున్నాడు. అజిత్ తన చిత్రంతో తాజాగా సరికొత్త రికార్డు నెలకొల్పి సత్తా చాటాడు. యూట్యూబ్ లో వివేగం చిత్రం సంచలనం సృష్టిస్తోంది.
సౌత్ చిత్రాలు నేరుగా హిందీలోకి అనువాదం అయి చాలా తక్కువగా విడుదలవుతుంటాయి. కానీ అన్ని చిత్రాలని హిందీలోకి డబ్ చేసి యూట్యూబ్ లోకి వదులుతుంటారు.
గత ఏడాది అజిత్ నటించిన వివేగం చిత్రం విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించేలేకపోయింది. అజిత్ చిత్రాలని ఎక్కువగా తెరకెక్కిస్తున్న శివ ఈ చిత్రానికి దర్శకుడు. తాజగా ఈ చిత్రాన్ని హిందీలోకిడబ్ చేసి యూట్యూబ్ లో వదిలారు. 24 గంటల్లోనే 8 మిలియన్ల వ్యూస్ సాధించిన ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించింది.
వివేగం చిత్రం హిందీలో డబ్ అయి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన సౌత్ చిత్రంగా రికార్డు సాధించింది. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రికార్డు బ్రేక్ అయింది. గతంలో ఈ రికార్డు బన్నీ సరైనోడు చిత్రం పేరిట ఉండేది. సరైనోడు చిత్రం 24 గంటల్లో 5 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.

Recommended