• 7 years ago
Irfan Khan suffering from Neuroendocrine Tumour: Everything you need to know about the disease

ఇర్ఫాన్ నటనంటే పడి చచ్చే ఎంతోమందికి ఇప్పుడాయన ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ ఖాన్ శుక్రవారం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు.
చర్మం లోపలి కణజాలంతోపాటు అంతర్గత శరీర భాగాలకు కూడా విస్తరించే 'న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్' అనే అరుదైన వ్యాధితో తాను బాధపడుతున్నట్టు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు వెళ్లినట్టు చెప్పారు.
ప్రముఖ అమెరికన్ రచయిత మార్గరేట్ మిచెల్ గాన్ 'విత్ ది వైండ్' పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ.. ఇర్ఫాన్ తన ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 'మనం ఆశించినది మనకు ఇవ్వడానికి జీవితం ఎటువంటి బాధ్యత వహించదు' అన్న ఆ మాటలు గుండెను తాకేలా ఉన్నాయి.
తనకు న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ ఉందని తెలిసినప్పటి నుంచి.. నిజాన్ని అంగీకరించడానికి మనసుకు చాలా కష్టంగా ఉన్నట్టు ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి నుంచి వస్తున్న మద్దతు అలాగే కొనసాగాలని, మీ నుంచి మరిన్ని విషెస్ కోరుకుంటున్నానని ఇర్ఫాన్ అభిమానులకు వెల్లడించారు.
తన ఆరోగ్యం గురించి చాలానే ఊహాగానాలు బయలుదేరాయని, అలాంటివేవి ఊహించుకోకుండా ఉన్న వారికి కృతజ్ఞతలు అని ఇర్ఫాన్ అన్నారు. అలాగే న్యూరో అంటే కేవలం మెదడుకు సంబంధించినది మాత్రమే కాదని చెప్పారు. నా మాటల కోసం ఎదురుచూస్తున్నవారికి మరిన్ని విషయాలు చెప్పడానికి త్వరలోనే నేను తిరిగి వస్తున్నానని ఆశిస్తున్నా.. అంటూ ఇర్ఫాన్ ముగించారు.
ఇర్ఫాన్ ప్రకటనతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలకు తెరపడినట్టయింది. అదే సమయంలో ఆయన ఆరోగ్యం కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.

Recommended