• 7 years ago
Juvva Movie Review and rating . The Juvva Movie is Action Romantic film directed by Triekoti Peta. The movie starred by Ranjith, Palak Lalwani, Murali Sharma, Ali, Posani Krishna Murali, Sapthagiri

రాజమౌళి దగ్గర అసిస్టెంటుగా పని చేసి దర్శకుడిగా మారిన త్రికోటి తాజాగా 'జువ్వ' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించడం, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్ కూడా బావుండటంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి పూర్తి కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన 'జువ్వ'తో త్రికోటి తన గోల్ రీచ్ అయ్యాడా? ఓ లుక్కేద్దాం...
శృతి తన స్కూలు రోజుల్లో బసవరాజు అనే ప్రేమోన్మాద విద్యార్థి వల్ల చాలా డిస్ట్రబ్ అవుతుంది. అతడి ఉన్మాద చర్యలను ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌ను సైతం చంపేసి జైలుకెళతాడు బసవరాజు. ఓసారి జైలు నుండి తప్పించుకుని శృతి ఇంటికి వచ్చి తన ఉన్మాదాన్ని ప్రదర్శిస్తాడు. బసవరాజు వల్ల ఎప్పటికైనా తన కూతురుకు ప్రమాదం ఉంటుందని భావించిన శృతి తండ్రి తన కూతురు ఊరు, పేరు అన్నీ మార్చేస్తాడు. పెరిగి పెద్దయి జైలు నుండి విడుదలైన వచ్చిన బసవరాజు(అర్జునా).... శృతి(పాలక్ లల్వానీ) ఆచూకీ కోసం వెతుకుంతుంటాడు
జువ్వ' కథలో హీరో రానా(రంజిత్). హీరోయిన్‌తో కానీ, విలన్‌తో కానీ ఎలాంటి సంబంధం ఉండదు. కథ ముందుకు సాగే కొద్దీ హీరోయిన్ హీరో ప్రేమలో పడుతుంది, హీరో- విలన్ మధ్య ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. శృతి కోసం ఎరినైనా చంపేసే రకం బవసరాజు, తన ప్రేమ కోస ఎంతకైనా తెగించే రకం రానా...... చివరకు కథ ఎలా సుఖాంతం అయిందో తెరపై చూడాల్సిందే.ఈ చిత్రంలో విలన్ పాత్రలో అర్జునా అనే మలయాళ నటుడు నటించాడు. విలన్ పాత్రలో ఓకే కానీ.... మరీ అంత పవర్‍‌ఫుల్‌గా అయితే ఏమీ కనిపించలేదు

Recommended