• 7 years ago
The anchor turned actress Anasuya has now found herself in a bizarre controversy after a resident of a Tarnaka in Hyderabad registered a complaint against her, for breaking her son's phone, while he tried to take a selfie with her.

ప్రముఖ తెలుగు యాంకర్, సినీ నటి అనసూయపై పోలీస్ స్టేషన్‌లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అనసూయ తమ ఫోన్ పగలగొట్టడంతో పాటు దుర్భాషలాడిందని సదరు మహిళ పోలీసులకు కంప్లైంట్ చేసింది. తార్నాక ప్రాంతంలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకోగా, బాధితురాలు ఉస్మానియా యూనివర్శిటీ పరిధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
మంగళవారం హైదరాబాదులోని తార్నాక ప్రాంతానికి ఏదో పని మీద అనసూయ వచ్చారు. అదే సమయంలో తన తల్లితో పాటు అటుగా వెళుతున్న ఓ బాలుడు అనసూయ కనిపించగానే అభిమానంతో ఆమె వద్దకు వెళ్లి సెల్ఫీ కోసం ప్రయత్నించాడు.
అయితే సదరు బాలుడు సెల్పీ తీసుకోవడానికి ప్రయత్నించడంతో యాంకర్ అనసూయ కోపోద్రిక్తురాలైంది. బాలుడి చేతిలోని ఫోన్ లాక్కుని నేలకేసి బద్దలు కొట్టింది. దీంతో తల్లీ కొడుకులతో పాటు అక్కడున్నవారంతా షాకయ్యారు.
తమ ఫోన్ బలవంతంగా లాక్కుని బద్దలు కొట్టడంపై తల్లీ కొడుకులు ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండానే అనసూయ వారిని దుర్భాషలాడుతూ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
తమ ఫోన్ ధ్వంసం చేయడంతో పాటు తనను నానా మాటలు అంటూ దుర్భాషలాడిన అనసూయపై సదరు మహిళ సమీపంలోని ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

Recommended