• 7 years ago
I entered politics for three reasons political transparency, political accountability and social justice. All the three are lacking in today’s politics and there is huge vacuum,” said Jana Sena Party founder and actor Pawan Kalyan on Thursday.

జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యామ్ గురువారం రాజమహేంద్రవరంలో పార్టీ కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌పై నిప్పులు చెరిగారు. అంతకుముందు ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పోలవరం ప్రాజెక్టును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఉందని చెప్పారు. అనంతరం ఆయన రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలతో మాట్లాడారు.
ప్రజలకు మంచి చేయాలనే తపన తన సోదరుడు చిరంజీవికి ఉండేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీలో నిస్వార్థ నాయకులు ఉండి ఉంటే ఇప్పుడు అధికారంలో ఉండేదని అన్నారు. ప్రజారాజ్యం నుంచి నేర్చుకున్న వాటితో జనసేనను స్థాపించానని చెప్పారు.
పరకాల ప్రభాకర్, నిర్మలా సీతారామన్‌లు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చిరంజీవి నోరు లేని వ్యక్తి కాబట్టే పరకాల తిట్టేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఆ సమయంలో తాను ఉండి ఉంటే సందర్భం మరోలా ఉండేదన్నారు. పరకాల వంటి నిబద్దత లేని వ్యక్తులు జనసేనకు అవసరం లేదన్నారు.

Category

🗞
News

Recommended